బంగారు ప్రియలకు శుభవార్త .. టుడే గోల్డ్ రేట్ తులం ధర ఎంత తెలుసా.?

Good news dears.. Do you know the price of today's gold rate?

దేశంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72వేలు దాటేసింది. అయితే గతకొన్ని రోజుల క్రితం తులం బంగారం ధర ఏకంగా రూ. 80 వేలమార్క్‌కు చేరువై దడ పుట్టిచ్చిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయం అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి భిన్నంగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం బంగారం ధరలో తగ్గుముఖం కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ తగ్గింది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలిసికుందాం.

Good news dears.. Do you know the price of today's gold rate?

* దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66,7400కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,790వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,590గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,640 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,590, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,640గా ఉంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,590గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 72,640 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర తగ్గితే.. వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. బుధవారం కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. కోల్‌కతా, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 87,100గా ఉంది. ఇక ముంబయి, పుణెలో కూడా కిలో వెండి రూ. 87,100 వద్ద కొనసాగుతోంది. అయితే.. చెన్నైతోపాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 92,100 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,590గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,640 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూను ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

 

Leave a Reply