చికెన్‌ ప్రియులకు గుడ్ న్యూస్ ….. కిలో ఎంతో తెలుసా?

Good news for chicken lovers ..... Do you know how many kilos are there?

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్‌ ధరలు దిగొచ్చాయి. లాస్ట్ మొంత్ కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్‌ రేట్లు చూసి సామాన్యుడు తినలేక గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు. శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ భారీగా రేట్లు చుక్కలు..

హైదరాబాద్: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్‌ ధరలు దిగొచ్చాయి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్‌ రేట్లు చూసి సామాన్యుడు తినలేక గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు. శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్‌ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ నెల మొదటి వారం నుంచి చికెన్‌ ధరలు రోజురోజుకు పతనమవుతూ వచ్చాయి. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఈ నెలంతా పూజలు, వ్రతాలు ఇతర కార్యక్రమాలతో మహిళలు యమ బిజీగా ఉంటారు. దీంతో మహిళలు మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వరు. మగవారు నేరుగా చికెన్‌ కొని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. ఏదో రెస్టారెంట్‌కి వెళ్లి తినాల్సిందే. దీంతో చికెన్‌ వినియోగం తగ్గి ధరలు కూడా పడి పోయాయి. మరోవైపు పూజలు, వ్రతాలతో సంబంధం లేని మరి కొందరు మాంసం ప్రియులు ఇదే అదనుగా చికెన్‌ లాగించేస్తున్నారు.

Good news for chicken lovers

ఆగస్టు 5న కిలో రూ.180 ఉన్న చికెన్‌ ధర.. ఆగస్టు 11వ తేదీ ఆదివారం నాటికి రూ.150కి తగ్గింది . ఆగస్టు 17వ తేదీ శనివారం రూ.158గా ఉంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఆదివారాలతో సహా అన్ని రోజుల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఆదివారాల్లో బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఆదివారం రాగానే చికెన్‌ రేట్లు అమాంతం పైకి ఎగబాకుతాయి. కానీ శ్రావణ మాసం కావడంతో అసలు కొనేవారే కరువయ్యారు.

దీనిపై చికెన్‌ సెంటర్‌ యజమానులు మాట్లాడుతూ.. త్వరలోనే మళ్లీ చికెన్‌ ధరలు పుంజు కుంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం శ్రావణమాసం కావడం, ఇతర పూజలు ఉన్నందున చికెన్‌ ధర రూ.150కి తగ్గిందని, గత నెలలో రూ.280 వరకు ఉందని అన్నారు. ఈ నెలలో వివాహాలు, శుభాకార్యాలు కూడా ఉన్నందున చికెన్‌ ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Leave a Reply