కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ని మీరు కూడా పొందాలనుకుంటే.. ముందుగా ఏ కంపెనీ తక్కువ ధరకు బెస్ట్ ప్లాన్ ని అందిస్తుందో తెలియాలి కదా ?జియో ఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లు ఎక్కువగా ఫేమస్ అయ్యాయి.అయితే ఈ రెండు కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడానికి బీఎస్ఎన్ఎల్ కూడా సిద్ధమైంది. ప్రజలను ఆకర్షించడానికి మంచి ఆఫర్ లతో కంపెనీలు ముందుకొస్తాయి.
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ BSNL Bharath fiber కూడా ఇప్పుడు ఒక మంచి ఆఫర్ తో ప్రజల ముందుకు వచ్చింది. రూ. 499 ప్లాన్ మొదటి 3 నెలలకు రూ.399 కే అందించబడుతుంది. మూడు నెలల తర్వాత మీరు ప్లాన్ కోసం రూ. 499 చెల్లించాలి. అంటే మూడు నెలల్లో రూ. 300 పొదుపు చేసుకునే అవకాశం ఉంది. ఒక నెల ఉచిత సేవ కూడా ఉంది. ఈ డీల్ కస్టమర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా వినియోగదారులు 60 Mbps స్పీడ్ తో 3300 GB డేటాను పొందుతారు. కానీ 3300GB డేటా వినియోగించిన తర్వాత, వేగం 4Mbps కి తగ్గిపోతుంది. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ధరలో 18 శాతం GST కూడా విడిగా వసూలు చేస్తారని మర్చిపోకండి.రూ. 499 ఈ ప్లాన్‌లో వినియోగదారులు 60Mbps వేగంతో 3300 GB డేటా, అపరిమిత డేటా డౌన్‌లోడ్ ఉంటుంది, ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్‌తో ప్రయోజనం ఉంటుంది.