ఈరోజుల్లో ఆడపిల్ల పుట్టగానే కొంత మంది తల్లిదండ్రులు బాధపడుతుంన్నారు.కొంతమంది తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహం, ఆమె పుట్టిన క్షణం నుంచి చదువు గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.అయితే మీరు మీ కూతురు కోసం ఆర్థిక ప్రణాళికను ముందుగానే ప్రారంభించినట్లయితే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. మీ ప్రణాళికకు ప్రభుత్వం కూడా సహాయం చేస్తోంది. అయితే మీరు మీ ప్రణాళికలో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎంచుకోవాలి.ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆడపిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించింది. సుకన్య సమృద్ధి అనేది ఆడ పిల్లల చదువు, వివాహాల టెన్షన్‌ని తొలగించడానికి సహకరిస్తోంది . మీ ఇంట్లో మీకు కవల కుమార్తెలు ఉన్నట్లయితే, మీరు సులభంగా ఉమ్మడి ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ సమయంలో మీ కుమార్తెకు సరైనన్ని డబ్బులు వచ్చేలా పనిచేస్తుంది.
సుకన్య సమృద్ధియోజన పథకంలో కచ్చితమైన హామీతో డబ్బులు వస్తాయి. ఇది గ్యారెంటీ స్కీమ్. మీరు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి రూ.250 కనీస పెట్టుబడితో పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో మీ పెట్టుబడిపై ప్రభుత్వం ఇప్పుడు మీకు 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఇందులో 15 ఏళ్ల వరకు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు వచ్చేస్తాయి.ఈ పథకంలో మీరు మీ కుమార్తె కోసం సంవత్సరానికి రూ. 1,00,000 పెట్టుబడి పెడితే, మీరు ప్రతి నెలా రూ. 8,334 పెట్టుబడి పెట్టవలిసి ఉంటుంది. ఈ విధంగా మీ మొత్తం పెట్టుబడి 15 సంవత్సరాలలో రూ. 15,00,000 పెట్టుబడి పెడతారు. 21 సంవత్సరాల తర్వాత మీకు రూ. 31,18,385 వడ్డీని పొందుతారు. మొత్తంగా రూ. 46,18,385 వస్తాయి.మీరు సంవత్సరానికి రూ.1,50,000 పెట్టుబడి పెడితే,15 ఏళ్లలో 22,50,000 కడతారు. మీకు రూ. 46,77,578 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.69,27,578 వస్తాయి.