తెలంగాణలకు వణికిస్తున్న వాన దేవుడు …. ఏపీలోనూ అదే సీన్ ఉటుందా..?

God of rain shaking Telangana.... Will the same scene happen in AP?

తెలంగాణలో వర్షం వణికిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షం దుమ్మురేపుతున్న వాతావరణ శాఖ రిపోర్ట్ తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు వర్షసూచన చేసింది.

ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు మరియు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ఉంది. సోమవారం నాటి ఉపరితల ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి ఎగువన 0.9 కి.మీ వరకు విస్తరించి తక్కువగా తెలిపారు.  సోమవారం నాటి ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు గుండా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు విస్తరించి తక్కువగా గుర్తించబడింది. ఈ క్రమంలో  రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..

God of rain shaking Telangana.... Will the same scene happen in AP?

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

మంగళవారం, బుధవారం, గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది

 

Leave a Reply