సెన్సార్ రివ్యూతో ‘గేమ్‌ఛేంజర్‌’ ….దూసుకుపోతోంది???

'Gamechanger' with Censor Review ....Shooting???

 

పెద్ద చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని రూపొందిచారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం ఈ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా థియేటర్లలో జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. సెన్సార్ బోర్డు గేమ్ ఛేంజర్ కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, జయరాం తదితరులు నటించారు. తమన్ సంగీతాన్ని అందించారు.

 

 

ఇది చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత రెండో భాగం నుంచి శంకర్ లోని అద్భుతమైన దర్శకుడు బయటకు వచ్చాడని, తనదైన శైలిలో ఒక పొలిటికల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దాన్ని శంకర్ తీశాడని చెబుతున్నారు. సినిమా విడుదల తర్వాత థియేటర్లలో శంకర్ శైలిని ప్రేక్షకులు చూస్తారన్నారు.ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్రైన్ ఎపిసోడ్ చూసి షాక్ అయ్యారు. అప్పటివరకు సినిమా మొదటి భాగం అంతా ఒక ఎత్తు, 20 నిముషాలు ఉండే ఆ సన్నివేశం మరో ఎత్తు అని వ్యాఖ్యానించారు.

 

అప్పన్న పాత్ర రంగప్రవేశంతో సినిమా మొత్తం మార్ఫు చెందింది. నటన పరంగా కూడా రామ్ చరణ్ కు మంచిపేరు వస్తుంది. సమాకాలీన రాజకీయ అంశాలపై సినిమాను శంకర్ బాగా రూపొందించాడని కొనియాడుతున్నారు. ఈ సినిమాను చూసిన చిరంజీవి దిల్ రాజుకు ఫోన్ చేసి సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని అభిమానులకు చెప్పమని సూచించారు. దీన్నిబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థమవుతోందంటున్నారు. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.ఎస్జే సూర్య నటన, శ్రీకాంత్ నటన, అంజలి నటన చాలా బాగా ఆకట్టుకుంటాయంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్లేనని సెన్సార్ రిపోర్ట్ గా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతుంది. సినిమా నిర్మాత దిల్ రాజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. 4 లేదంటే 5 తేదీల్లో ఈ వేడుక జరిగే అవకాశం ఉంది.

Leave a Reply