‘పుష్ప2’ రికార్డును క్రాస్ చేసిన ‘గేమ్‌ఛేంజర్‌’

 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదలైంది. జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలై 24 గంటలు జరుగుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దీన్ని విడుదల చేశారు. విడుదలైన తర్వాత అన్ని ప్లాట్ ఫామ్స్ లో ఇది వేగంతో దూసుకుపోతోంది. భారీ రికార్డులను కైవసం చేసుకోవడంతోపాటు, పాత రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టేస్తోంది. ఈ ఒరవడి సినిమా విడుదలైన తర్వాత కూడా కొనసాగితే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు తెలిపారు.

 

 

ఈ ఫొటో ఇప్పడు బాగా వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం తదితరులు నటించారు. రామ్ చరణ్ నాలుగు పాత్రల్లో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో ట్రైలర్ దూసుకుపోతోంది. 24 గంటల్లో 180 మిలియన్ల వీక్షణలు సాధించింది. పుష్ప2, దేవర సినిమా హిందీ, తమిళ రికార్డులను ఒక్క దెబ్బకు లేపేసింది. 15 గంటల వ్యవధిలోనే ఈ రికార్డులన్నీ బద్దలయ్యాయి. అన్ని ప్లాట్ ఫామ్స్ లో ట్రైలర్ మెరుపువేగంతో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతోపాటు తెల్లగుర్రం పక్కన రామ్ చరణ్ పరిగెడుతున్న పోస్టర్ ను విడుదల చేయగా ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.

 

 

ఈ సినిమాకు సంబంధించి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసిన శంకర్ భారతీయుడు2 తీసి విడుదల చేశారు. అది ఘోర పరాజయం పాలవడంతో ఎవరూ గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెట్టుకోలేదు.  ఈరోజు సాయంత్రం రాజమండ్రికి సమీపంలోని వేమగిరి వద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. సినిమాకు ఏపీలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చారుకానీ తెలంగాణలో మాత్రం ఇవ్వలేదు. దీంతో సినిమా కలెక్షన్లపై అది ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. సినిమాపై రోజురోజుకు హైప్ పెరుగుతోంది.

Leave a Reply