హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో 24 సార్లు ఆచరిస్తారు. 2025 సంవత్సరంలో వస్తున్న విశిష్టమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి శ్రీమహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ప్రారంభమై జనవరి 10 ఉదయం 10.19 నిమిషాలకు పూర్తిఅవుతుంది.
వైకుంఠ ఏకాదశి నాడు శుక్ల యోగా ఉదయం తిథి ప్రకారం జనవరి 10నే వైకుంఠ ఏకాదశి జరుగుతుంది. అయితే వైకుంఠ ఏకాదశి ఈసారి ప్రత్యేక యోగ కలయికతో రాబోతుంది. వైకుంఠ ఏకాదశి రోజు శుక్ల యోగ ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించబడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏమిటో చూదాం.
కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వైకుంఠ ఏకాదశి నుండి కలిసొస్తుంది. వైకుంఠ ఏకాదశి తర్వాత వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. నూతన ఆలోచనలు, ప్రణాళికలు వీరికి ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ సమయం తులా రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా చెబుతారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి.వర్తక వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బలపడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. తులారాశి వైకుంఠ ఏకాదశి నుండి తులారాశి వారు వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి వైకుంఠ ఏకాదశి నుండి ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు కెరీర్లో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది . ధనుస్సు రాశి వారి గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది.
మీన రాశి మీన రాశి వారిపై శ్రీమహావిష్ణువు కటాక్షం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నుండి ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో వేగవంతమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఇది మీన రాశి వారికి అదృష్ట సమయం.
గమనిక : ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.