మూత్ర విసర్జన చేసేటప్పుడు నురగ వస్తోందా..? ఐతే మీరు ప్రమాదంలో పడుతున్నట్లే..

Foaming while urinating

నురుగుతో కూడిన మూత్ర విసర్జన కొన్నిసార్లు సాధారణమైనది. కానీ తరచుగా నురుగు వస్తే మాత్రం అది తీవ్రమైన సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు.నురుగుతో కూడిన మూత్రం లక్షణాలను ముందు పసిగట్టడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రం రంగులో మార్పు, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం మూత్రవిసర్జన సమయంలో నురుగు వంటి అనేక వ్యాధుల లక్షణాలు కావచ్చని దీనిని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి సమస్య తో ఉంటే , వెంటనే డాక్టర్‌ని సంప్రదించమని చెప్పండి.ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతం కావచ్చు. ఓ అధ్యయన ప్రకారం.. మూత్రం నురుగు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని పరీక్షలు చేయించుకోవాలని సవివరంగా వెల్లడించారు.

Monobind.com: Human Urine

నురుగు (Foamy Urine) మూత్రం కారణాలు:

కిడ్నీ సమస్యలు: మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, మూత్రంలో నురుగు కనిపించవచ్చు. నిజానికి, మూత్రపిండ సంబంధిత సమస్యలు కూడా నురుగుతో కూడిన మూత్రానికి అతి ప్రమాదమైన కారణం కావచ్చు.

మధుమేహం: ఎక్కువ శాతం చక్కెర అనేది మధుమేహ రోగుల మూత్రంలో నురుగును కలిగిస్తుంది. శరీర రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో నురుగు ఏర్పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా నురుగుతో కూడిన మూత్రానికి ప్రధమ కారణమవుతాయి.

4,100+ Urine Man Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

మూత్రంలో నురుగు ఉంటే ఏ పరీక్షలు చేయాలి?..

మూత్ర పరీక్ష: మూత్రంలో ప్రోటీన్, గ్లూకోజ్, ఇతర కారకాలను టెస్ట్ చేయడం అవసరం..

రక్త పరీక్ష (కిడ్నీ ఫంక్షన్ టెస్ట్): మూత్రపిండాలు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ పరీక్షచేయించాలి.

మైక్రోఅల్బుమిన్ పరీక్ష : ఇది మూత్రంలో ప్రోటీన్స్ మొత్తాన్ని టెస్ట్ చేస్తుంది.

మూత్రంలో తరచుగా నురగలు, ముదురు పసుపు, ఎరుపు లేదా అసాధారణ రంగులో మూత్రవిసర్జన, మంట, నొప్పి లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఏదైనా అసౌకర్యం, వాపు ఉంటే, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

 

Leave a Reply