నిమిషాల్లో నిద్రలోకి జారుకోవాలా ? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Fall asleep in minutes? Follow these tips

Tips for Sleep :  నిజానికి చాలా మంది నిద్ర విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా సరిగ్గా నిద్ర పట్టక పోవడం పదే పదే భయంకరమైన డ్రీమ్స్ రావడం తీవ్రమైన ఒత్తిడి తో సతమతం అవ్వడం లేదంటే గజిబిజిగా ఉండటం ప్రశాంతత లేక పోవడం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అలానే ఒత్తిడి లేకుండా ఆనందంగా నిద్ర పోతే చక్కగా ఆనందంగా మనం ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి అలా ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది పైగా మంచి నిద్రని కూడా పొందలేము.ఇటువంటి సమస్యలు కలిగి ఉన్న వాళ్ళు చక్కటి పద్ధతిని అనుసరిస్తే మంచి బయట పడొచ్చు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా ఇబ్బంది పడే వాళ్లు స్పిరిచ్యువల్ లీడర్ ఫౌండర్ ఆఫ్ ఏ ఐ ఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ రియలైజేషన్ రవి కొన్ని టిప్స్ చెప్పారు మరి ఆయన చెప్పిన టిప్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం తెలుసుకోండి .

Fall asleep in minutes? Follow these tips
చక్కటి నిద్రని కూడా పొందొచ్చు. ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. అలానే నాణ్యమైన నిద్రని కూడా పొందడానికి అవుతుంది. అయితే మరి ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి కష్టంగా ఉంటాయా అని మీరు ఆలోచించొద్దు ఇవి చాలా సులభంగా ఉన్నాయి. పైగా ఎవరైనా సరే వీటిని ఫాలో అవ్వొచ్చు.

ప్రతీ రోజు మెడిటేషన్: చాలా సార్లు మీరు ఈ విషయాన్ని వినే వుంటారు. మెడిటేషన్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని. నిజంగా మెడిటేషన్ వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను మనం పొందొచ్చు. ప్రతి రోజూ మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. మెదడుకు ఎంతో నిశబ్దంగా మారుతుంది సాధారణంగా మన మెదడు 50 ఆలోచనలను ప్రొడ్యూస్ చేస్తుంది అది కూడా ఒక నిమిషంలో. అంటే రోజుకి 50 వేల ఆలోచనలు వరకు మనకు వస్తూ ఉంటాయి. కోతి లాగ మన యొక్క ఆలోచనలు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఉరుకుతూ ఉంటాయి. మన మెదడు కనుక ఇలా పని చేస్తూ ఉంటే మనకు నిద్ర పట్టదు. అయితే ఎప్పుడైతే మెంటల్ థాట్ రేట్‌ని తగ్గించుకుంటారో అప్పుడు చక్కగా ప్రశాంతంగా ఉండడానికి అవుతుంది. యాభై ఆలోచనల నుంచి ఒక ఆలోచన కి తీసుకు వస్తే చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు మంచిగా మెడిటేషన్ చేయడం వల్ల రిలాక్స్‌గా ఉండొచ్చు. అలానే నిద్రలేమి సమస్య నుండి కూడా బయట పడొచ్చు.

ఇతర లాభాలు:

  • ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ సహాయ పడుతుంది.
  • అదే విధంగా మీ యొక్క ఏకాగ్రతను కూడా పెంపొందించుకోవడానికి అవుతుంది.
  • ఆందోళన తగ్గి మీరు కుదుట పడవచ్చు.
  • మెడిటేషన్ తో స్వచ్ఛమైన స్థితిని అనుభవించడానికి కూడా అవుతుంది. ప్రశాంతంగా మీ మనసు ఉంటుంది.
  • అలానే కమ్యూనికేషన్ కూడా బాగా జరిగేటట్టు చేస్తుంది మెడిటేషన్.

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు ప్రతి రోజు మెడిటేషన్ చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే మెడిటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. వీటిని ఫాలో అయితే మంచిగా మెడిటేషన్ చేయడానికి అవుతుంది.

  • మెడిటేషన్ చేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి. అప్పుడు మీరు ఏకాగ్రత పెట్టడానికి అవుతుంది.
  • అలానే మీ పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ప్రశాంతతనిచ్చేలా ఉండాలి.
  • ఉదయం మరియు సూర్యాస్తమయం అయ్యే సమయం మెడిటేషన్ చేయడానికి మంచిది అలానే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కంఫర్ట్ గా కూర్చోవాలి. అప్పుడే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఏకాగ్రత పూర్తిగా పెట్టడానికి అవుతుంది.
  • మెడిటేషన్ చేసే ముందు ఏమీ తినకండి అప్పుడు మెడిటేషన్ బాగా చేయొచ్చు.
  • మొదట మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఈజీగా ఉండే వ్యాయామాలతో స్టార్ట్ చేయండి మెడిటేషన్ చేసేటప్పుడు ఆనందంగా నవ్వుతూ చేయండి ఇలా ఈ చిట్కాలను ఫాలో అయ్యారంటే కచ్చితంగా బాగా మెడిటేషన్ చేయడానికి అవుతుంది.

Leave a Reply