గత కొంత కాలంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 12 రోజులుగా కేసీఆర్ తీవ్ర అస్వస్థత గురికావడం జరిగింది. యశోద హాస్పిటల్ బృందం గజ్వేల్ లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ ని నెలకొల్పి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు.అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో ఫాంహౌస్ కి తీసుకువచ్చారు. హాస్పిటల్ లో జాయిన్ అయితే,పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకుంటుంది అని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులతో చెప్పారు అని సమాచారం.
అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో ఫాంహౌస్ కి తీసుకువచ్చారు. హాస్పిటల్ లో చేరితే , పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకుంటుంది అని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులతో కెసిఆర్ చెప్పినట్లు సమాచారం అందుతుంది.150 రోజులుగా తన కూతురు జైల్లో ఉండడం, అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోకసభలో సీట్స్ రాకపోవడం, కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనలతో తీవ్రమైన మనోవేదన చెందాడు అని సమాచారం. కేసీఆర్ ఆరోగ్య విషయం తెలిసిన కొందరు నాయకులు అయ్యన హెల్త్ బులిటెన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.