తమ్ముడికి రాఖీ కట్టి కన్నుమూసిన అక్క…పండుగ వేళ విషాదం

Elder sister who passed away while tying rakhi to younger brother...Tragedy at the time of festival

గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స కోసం హుటాహుటినా ఆస్పత్రిలో తీసుకొచ్చారు . కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనని భావించి శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే కన్నుమూసింది . కళ్ల ముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తోడబుట్టిన వారి రోదనలు మిన్నంటాయి.

పవిత్రమైన రాఖీ పండుగుపూట మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు రాఖీ కట్టి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికులతో పాటు విషయం తెలిసిన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. జిల్లాలోని నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతి ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది.

గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స కోసం హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనని భావించి శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచింది. కళ్ల ముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తోడబుట్టిన వారి రోదనలు మిన్నంటాయి. ఇదంతా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.నెటిజన్లను సైతం కన్నీరు పెట్టిస్తోంది.

Leave a Reply