అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రి గా నిలిచారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం(డిసెంబర్ 30) విడుదల చేసిన నివేదికలో ఈ సమాచారం అంతా ఉంది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లు అని నివేదిక పేర్కొంది.2023-2024లో భారతదేశ తలసరి నికర జాతీయ ఆదాయం ఎన్‌ఎన్‌ఐ సుమారు రూ. 1,85,854 కాగా, ముఖ్యమంత్రి సగటు స్వీయ ఆదాయం రూ. 13,64,310, ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు ఎక్కువ.
ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకు రూ.10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ సమాచారం అంతాపొందుపరిచారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ. 55 లక్షల ఆస్తులతో జాబితాలో రెండవ అతి తక్కువ సంపన్న సిఎం కాగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 1.18 కోట్ల రూపాయల ఆస్తులతో మూడవ అతి తక్కువ సంపన్న సిఎంగా ఉన్నారు. ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రూ.23 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు.