కొరియన్లు చాలా అందంగా ఉంటారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా కూడా ఎప్పుడు కాంతిమంతంగా మెరుస్తుంటారు. వయస్సు పెరిగినా సరే యంగ్‌గానే కనిపిస్తారు.వయస్సు పైబడినా వీళ్లు యవ్వనంగా ఎలా ఉంటారని ఇండియన్ గర్ల్స్ ఆలోచిస్తుంటారు. అసలు కొరియన్లు ఎల్లప్పుడు అందంగా ఉండటం ఎలా అని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తుంటారు.కొంతమంది అసలు స్కిన్ విషయంలో కేర్ తీసుకోరు కానీ వాళ్ల చర్మం మంచిగా ఉంటుంది. కొందరైతే ఎంత జాగ్రత్త వహించిన వాళ్ల చర్మం అంత గ్లో ఉండదు. దీనికి ముఖ్య కారణం చర్మం కాంతిమంతంగా మెరవాలని చిట్కాలు పాటిస్తే సరిపోదు.. జీవనశైలిలో కూడా మార్పులు చేయాలి. మనం తినే ఫుడ్ మన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు అందంగా కూడా కనిపిస్తారు.
ఇండియన్స్ ఎక్కువగా జంక్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. బిర్యానీలు అని అధికంగా బయట ఫుడ్ తింటున్నారు. వీటిలో ఎక్కువగా ఆయిల్, మసాలా ఉండటం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల ఫేస్‌లో గ్లో పోతుంది. మరి కొరియన్లలా ఎల్లప్పుడూ అందంగా ఉండటానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.అందంగా కనిపించాలంటే చర్మానికి క్రీములు రాసి తెల్లగా మెరిసిపోవడం కాదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల అందంగా ఉంటారు. కొరియన్లు ఎక్కువగా పులియబెట్టిన ఆహారాలు తీసుకుంటారు. కిమ్చి, గోచుజాంగ్ వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలను తింటారు. ఇవి ప్రోబయోటిక్స్‌తో ఉంటాయి. వీటిని తినడం వల్ల స్కిన్ మెరవడంతో పాట యవ్వనంగా ఉంటారు. అలాగే జీర్ణాశయం కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
వీళ్లు నీటిని ఎక్కువగా తీసుకుంటారు. రోజంతా హడ్రేట్‌గా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల చర్మం మెరుస్తుంది. కొరియన్లు నిద్ర విషయంలో అస్సలు తగ్గరు. ఫుల్‌గా పడుకుంటేనే అందం గా కనిపిస్తారని భావిస్తారు. అలాగే వీళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. నడకతో డ్యాన్స్ చేస్తుంటారు. సమస్యలు ఉంటే టెన్షన్‌గా ఫీల్ కాకుండా.. యోగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడికి గురికాకుండా ఉంటారట. పోషకాలు ఉండే బలమైన ఆహారం మాత్రమే తింటారు. ఫాస్ట్ ఫుడ్‌కి దూరంగా ఉంటారు. బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకుంటారు. చర్మానికి సూర్యరశ్మి తగలకుండా సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతుంటారు.
ఇండియన్స్ ఎక్కువగా మసాలా ఫుడ్స్ తింటుంటారు. ఇది ఎక్కువగా చర్మంపై ప్రభావం పడుతుంది. మసాలా ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మంపై తొందరగా ముడతలు వస్తాయి. వీటికి బదులు ప్రొటీన్స్ ఉండే ఆహార పదార్థాలను తినడంతో పాటు పండ్లు, రసాలు తీసుకుంటే చర్మం అందంగా మెరుస్తుంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. సమయానికి తింటూ యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. పనుల్లో బిజీ అయిపోయి లేటుగా నిద్రపోతున్నారు. ఒక్కరోజు నిద్ర లేకపోయన చర్మం నల్లగా మారిపోతుంది. ఎంత ఫుల్‌గా నిద్రపోతే చర్మం అంత కాంతివంతంగా మెరిసిపోతుంది. కాబట్టి సరైన ఆహారం తీసుకోండి.