ప్రముఖ యూట్యూబర్, మహాసేన రాజేశ్‌పై దివ్వెల మాధురి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్సనల్ సమస్యల గురించి మాట్లాడటానికి నువ్వు ఎవడివి రా రాజేష్ చెప్పుతో కొడతా అంటూ హెచ్చరించింది.అసలు నీ బ్రతుకు ఏంటీ నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు పోయిందో అది చూస్కో ముందు అంటూ దివ్వెల మాధురి హెచ్చరించింది. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నివ్వు ఎవడవురా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసేన రాజేశ్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్టు ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిల మధ్య జరిగిన వివాదంలో మహాసేన రాజేశ్ తలదూర్చారు. దివ్వెల మాధురిపై మహాసేన రాజేశ్ అనేక రకాలైన అంశాలపై వీడియో రూపంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. వీటిపై దివ్వెల మాధురి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.