సమాజంలో ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలని, సానుకూల ఫలితాలు పొందాలని ప్రయత్నం చేస్తూనే అనుకుంటున్నాము. ఇక ప్రతిరోజు తమ జాతకం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి గ్రహాల గమనాన్ని, వివిధ గ్రహాల కారణంగా ఏర్పడే యోగాలను గురించి తెలుసుకోవడం పైన ఆశచూపిస్తాము. ఇక వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహంగా చెప్పుకునే చంద్రుడు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని యోగాలను ఏర్పరుస్తున్నాడు. నేడే శక్తివంతమైన గజకేసరి రాజయోగం నేడు చంద్రుడు గురువుతో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరిచాడు. ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తోంది. గజకేసరి రాజయోగం కారణంగా జనవరి మాసంలో లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలిసికుందాం.
వృషభ రాశి : వృషభ రాశిలో మొదటి గృహంలో గజకేసరి రజయోగ ఏర్పడడం వల్ల వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఇప్పుడు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి, వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలతో గజకేసరి రాజయోగం వృషభ రాశి జాతకులను సంపన్నులుగా మారుస్తుంది. ఈ సమయం వృషభ రాశి జాతకులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి : వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులతో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఆరవ గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల ఇది ధనుస్సు రాశి జాతకులను అదృష్టవంతులుగా మారుస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుంచి ఊహించని లాభాలు ఆర్జిస్తారు.
కుంభరాశి : కుంభరాశిలో నాలుగవ గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కుంభరాశి జాతకులు మంచి ఫలితాలను పొందుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎన్నో పనులు ఈ సమయంలో కుంభ రాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఆర్థిక పురోగతి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. కుంభరాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొంది సంతోషంగా జీవిస్తారు.
గమనిక: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.