భారీ కలెక్షన్లు తో ‘డాకు మహారాజ్’ ……

'Daku Maharaj' with huge collections

 

కొల్లి బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన డాకూ మహారాజ్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య రూ.100 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీడియోల్, రిషి, చాందినీ చౌదరి, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు నటించారు. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే స్థాయిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. బాలయ్య సినిమా అంటేనే తమన్ కు పూనకాలు వచ్చేస్తాయని మరోసారి నిరూపించుకుంది.

 

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.68 కోట్లు జరిగింది అని తెలిసింది . ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్ల లక్ష్యంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలిరోజు రూ.30 కోట్లు అందుకుంది. బుక్ మై షోలో టికెట్లతోపాటు అడ్వాన్స్ బుకింగ్స్‌, ఏపీ, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ , స్పెషల్ షోల కారణంగా బుకింగ్స్‌లో అద్భుతమైన నటన కనపరిచింది. 13 బోగీ, 14 సంక్రాంతి, 15 కనుమ పండగ కావడంతో తొలి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గుంటూరులో ఈ సినిమా రూ.7.2 కోట్లకు, నెల్లూరులో రూ.2.7 కోట్లకు కృష్ణా జిల్లాలో రూ.5.4 కోట్లకు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లకు అమ్ముడుపోయింది. అఖండ, వీరసింహారెడ్డి, క్లైమాక్స్ బాగోలేదని టాక్ వచ్చినప్పటికీ సినిమాలో ఉన్న ఎలివేషన్లను, బాలయ్య డైలాగులు, బాబీ స్టైలిష్ టేకింగ్, తమన్ సంగీతం, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ విజయ్ కన్నన్ పనితీరు మొత్తం కలిపి డాకూ మహారాజ్ ను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయని భావిస్తున్నారు. భగవంత్ కేసరి తర్వాత డాకూ మహారాజ్ కూడా హిట్ కావడంతో డబుల్ హ్యాట్రిక్ కు బాలయ్య పునాది వేసుకున్నారని, సీనియర్ హీరోల్లో అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply