నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఫుల్ ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ షోతో బాలయ్య ఇమేజ్ పెరిగిందని చెప్పొచ్చు. బాలకృష్ణను హోస్ట్ గా చూసి చాలామంది ఆయన అభిమానుఉన్నారు. ఎక్కడ చూసినా జైబాలయ్య అన్న పాటే వింటూఉంటాం. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రముఖ హీరోలంతా పాల్గొంటున్నారు. అలాగే బాలయ్య నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య చిరంజీవి, మోహన్ బాబుపై పరోక్షంగా ట్రోల్ చేశారు .ఈ సందర్భంగా బాలయ్య ఓ డైలాగ్ చెప్పారు. కట్టె.. కొట్టె.. తెచ్చె అన్నారు. దీన్ని గురించి వివరం చెప్పను కానీ సినీ పరిశ్రమలో కొన్నాళ్ల క్రితం ఒక గొడవ జరిగింది.. వారెవరు అనేది నేను పేర్లు చెప్పనుకానీ, నేను లెజెండ్ అంటే నేను లెజెండ్ అంటూ కొట్లాడుకున్నారు. ఆ గొడవ లోతుల్లోకి నేను వెళ్ల దలుచుకోలేదు.. వాళ్లు మాత్రం లెజెండ్ విషయంలో కొట్టుకు చచ్చారు..
నేను ఇన్ని సినిమాలు చేశానని ఒకరు అంటే, మరొకరు నాకు ఇంత అనుభవం ఉందన్నారు తెలిపారు. అసలు లెజెండ్ ఎవరు అని బాలకృష్ణ ప్రశ్నించారు? 50 సంవత్సరాల నుంచి తాను పౌరాణిక సినిమాలు, గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు, యాక్షన్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు, జానపద సినిమాలు.. ఇలా అన్నిరకాల సినిమాలు చేశానని, తాను అడుగు పెట్టని నేపథ్యం లేదని, వీటన్నింటినీ ప్రజలు బాగా ఆదరించి తనను గుండెల్లో పెట్టుకున్నారని బాలయ్య అన్నారు. అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు లెజెండ్ అంటే ఎవరు అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదని, ఆ విషయాన్ని ఇప్పటికే ప్రజలంతా చెప్పారన్నారు. తన సినిమాలను సూపర్ హిట్ చేసి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఇప్పుడు నన్ను ఒక లెజెండ్ గా నిలబెట్టారన్నారు.
తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబు, చిరంజీవి మధ్య గొడవ జరిగిన సంగతి తెలుసు. 500కు పైగా సినిమాల్లో నటించిన తాను ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించానని, రాజ్యసభ సభ్యుడిగా, విద్యాసంస్థల అధినేతగా ఉన్న తనను లెజెండ్ గా ఎందుకు గుర్తించరని అడిగారు. దీనికి చిరంజీవి స్పందించారు. తనకు లెజెండరీ స్టేటస్ వచ్చిందని చెప్పేంతవరకు పరిశ్రమ ఇచ్చిన అవార్డును తీసుకోను అన్నారు. ఆ వివాదం ఇప్పటికీ సినీ ప్రియులందరికీ బాగా గుర్తుంటుంది.