ఆ రాజభవనాలను కూల్చగలరా……? హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Can you demolish those palaces? KTR's sensational comments on the demolition of Hydra

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు హైడ్రా, మరోవైపు జీహెచ్‌ఎంసీ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి.. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే కదా.. మరి, కాంగ్రెస్‌ నేతల ఫామ్‌హౌస్‌లను కూల్చాలంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కీ, గుత్తాకి ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని తెలిపారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫామ్‌ హౌస్‌ ఎక్కడుందో కూడా చూపిస్తా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి ఫామ్‌ హౌస్‌ కూడా నీళ్లల్లోనే కట్టారని తెలిపారు. FTL పరిధిలో కట్టిన కాంగ్రెస్‌ నేతల రాజభవనాలను కూల్చగలరా? అంటూ కేటీఆర్‌ సవాల్ చేశారు. హైడ్రా.. అనేది పెద్ద హైడ్రామా కాకపోతే… ముందు మంత్రుల ఫామ్‌హౌస్‌ల నుంచే కూల్చివేతలు ప్రారంభించాలంటూ కోరారు.. పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలకు కూడా ఫామ్ హౌస్‌లు ఉన్నాయి.. తనకు ఏ ఫామ్‌ హౌస్‌ లేదని తెలిపారు. మిత్రుడిది లీజుకి మాత్రమే తీసుకున్నానని.. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి ఫామ్‌ హౌస్‌ కూడా నీళ్లల్లోనే కట్టారని తెలిపారు. FTL పరిధిలో కట్టిన కాంగ్రెస్‌ నేతల రాజభవనాలను కూల్చగలరా? అంటూ కేటీఆర్‌ సవాల్ చేశారు.

Can you demolish those palaces? KTR's sensational comments on the demolition of Hydra

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన వివేక్ వెంకటస్వామి

కాగా.. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్‌లో సంచలనంగా మారాయి.. దీంతో ఫామ్‌హౌస్‌ యజమానుల్లో దడ మొదలైంది.. తమకున్న ఫామ్‌హౌస్‌లపై రాజకీయ నేతలు, ప్రముఖులు అలర్ట్‌ అవుతున్నారు.. హైడ్రా దూకుడుతో .. తమదాకా రాకుండా ఫామ్‌హౌస్‌ యజమానులైన కొందరు నేతలు లాబియింగ్ చేస్తున్నారు. మరికొందరు తమ ఫామ్‌హౌస్‌లు FTL పరిధిలో లేవంటూ ముందే ప్రకటనలు చేస్తున్నారు.. ఈక్రమంలోనే.. మరికొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలాఉంటే.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు.. తన ఫామ్‌హౌస్‌పై అసత్య ప్రచారం జరుగుతోందని.. నిబంధనల ప్రకారమే తాము ఫామ్‌ హౌస్‌ నిర్మించుకున్నామని తెలిపారు. దీనిపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చొద్దు..

కాగా.. రేపటివరకు జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే.. విధివిధానాలపై హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా.. 111 జీవో పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ వివరించారు. హైడ్రా ఏర్పాటుకు కారణాలు కోర్టుకు వివరించిన ఏఏజీ.. GHMC సమన్వయంతో కూల్చివేతలు చేస్తున్నామని తెలిపారు. కాగా.. జన్వాడ ఫామ్‌హౌస్‌పై ప్రదీప్‌రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు.. ప్రదీప్‌రెడ్డి పిటిషన్‌ మేరకు హైడ్రా కూల్చివేతలపై రేపటివరకు స్టే విధించింది.

Leave a Reply