బ్లాక్ బస్టర్ సాధించిన ఆయ్ మూవీ.. 2 రోజుల్లోనే ఊహకందని వసూళ్లు

Aay is a Telugu romantic comedy entertainer movie directed by Anji Kanchipalli

టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలు తమ ఫ్యామిలీల నుంచి హీరోలను పరిచయం చేస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది వచ్చి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.మొదటి చిత్రంతోనే హిట్ కొట్టిన అతడు,ఇప్పుడు ‘ఆయ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు గుడ్ టాక్ తో పాటు రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది. దీంతో కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. మరి ‘ఆయ్’ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!

ఆయ్ అంటూ వచ్చిన నితిన్:

నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమానే ‘ఆయ్’. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందించాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా:

రూరల్ బ్యాగ్‌డ్రాప్‌లో కామెడీ ఎలిమెంట్లతో రూపొందిన సినిమానే ‘ఆయ్’. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమా ను మంచిగా ప్రమోషన్ కూడా చేశారు.దాని ఫలితంగానే వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.20 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

 

 

Leave a Reply