మంచి ఫీచర్లు, గుడ్ పనితనం కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా ? ధర కూడా అందుబాటులో ఉండాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ లో దాదాపు స్మార్ట్ ఫోన్లపై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 12 వరకూ సేల్ కొనసాగుతుంది. సూపర్ ప్రీమియం మోడల్ ఫోన్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో మోటరోలా, ఒప్పో, సామ్‌సంగ్, యాపిల్ కంపెనీలకు సంబంధించిన ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
ఫొటోగ్రఫీ జౌత్సాహికులు, ఎక్కువగా ఫోన్ వినియోగించుకునే వారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ చాలా ఉస్ ఫుల్ గా ఉంటుంది . దీనిలోని సోనీ లిటియా 700సీ సెన్సార్‌ను కలిగిన 50 ఎంపీ ప్రధాన కెమెరా కారణంగా తక్కువ కాంతి ఉన్న సమయంలోనూ నాణ్యత గల ఫొటోలు తీసుకోవచ్చు. 13 ఎంపీ అల్ట్రా వైడ్, మాక్రో, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 144 హెచ్ జెడ్ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్ తో పాటు 68 డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జర్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్‌తో అందుబాటులో ఉంది. ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ ధర రూ. 24,999.
సరికొత్త సాంకేతికతతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 5జీ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ ప్లే కారణంగా పిక్చర్ ను చాలా స్పష్టంగా చూడవచ్చు. దీనిలోని ఐ కంఫర్ట్ షీల్డ్ ను కళ్లకు చక్కని రక్షణ కల్పిస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఏర్పాటు చేశారు. అలాగే 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. 256 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 8 జీబీ ర్యామ్, 3900 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 48,999కు ప్రస్తుతం అందుబాటులో ఉంది.
స్లైలిష్ లుక్, కేవలం 177 గ్రాముల బరువుతో ఒప్పో ఎఫ్ 25 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ చాలా సన్నగా తేలికగా ఉంటుంది. 6.7 అంగుళాల అమోలెడ్ అల్ట్రా స్లిమ్ బెజెల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కెమెరా విషయానికి వస్తే 32 ఎంపీ సెల్ఫీ షూటర్, 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు మరో మూడు లెన్స్‌లు ఉన్నాయి. 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మాక్రో లెన్స్ తో అద్భుతమైన చిత్రాలను తీసుకోవచ్చు. అలాగే 2 టీబీకి విస్తరించే అవకాశం ఉన్న 128 జీబీ రోమ్, 8 జీబీ ర్యామ్, డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లు అమర్చారు. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ధర: రూ.23,999.
ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేతో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అధిక స్క్రీన్-టు-బాడీ రేషియో, రిజల్యూషన్, మెరుగైన రిఫ్రెష్ రేట్ కారణంగా పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. నాణ్యత కలిగిన ఫొటోలను తీసుకునేందుకు 64 ఎంపీ డ్యూయల్ అల్ట్రా-క్లియర్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఏఐ పోర్ట్రెయిట్ రీటౌచింగ్, ఏఐ ఎరేజర్ వంటి మెరుగైన ఫీచర్లు దీనిలో ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 67డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్యలు ఉండవు. గొరిల్లా గ్లాస్ తో కూడిన 3డీ కర్వ్డ్ స్క్రీన్, కాస్మోస్ రింగ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999.
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లోని 6.7 అంగుళాల స్క్రీన్, 12 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలు ఆకర్షణీయంగా ఉంది . దీనిలోని డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో పోర్ట్రెయిట్ మోడ్, ఫోకస్, డెప్త్ కంట్రోల్‌తో ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. దీనిలోని లిథియం – అయాన్ బ్యాటరీ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఫోన్ సులభంగా రీఛార్జ్ చేయడానికి మాగ్ సేఫ్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. ఏ15 బయోనిక్ చిప్ కలిగిన ఫోన్ లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ చేసుకోవచ్చు. భద్రతకు సంబంధించి ఫేస్ ఐడీ, బేరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్లు ఉన్నాయి. ఈ ఆపిల్ ఐఫోన్ రూ. 57,499కు అందుబాటులో ఉంది.