నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ఆదివారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ మూవీ. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తొలి ఆట నుంచే సినిమా పాజిటివ్ టాక్ పొందింది. వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.
తమన్ అదిరిపోయే స్థాయిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది అని తెలిపారు. బాలయ్య సినిమా అంటేనే తమన్ కు పూనకాలు వచ్చేస్తాయని మరోసారి రుజువు చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.68 కోట్లు జరిగింది. ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్లు అందుకుంది. దీంతో బాలకృష్ణ కెరీర్లోనే ‘డాకు మహారాజ్’అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిపోతాది అని అంటున్నారు.
దీంతో ఊర్వశి ఇబ్బంది పడినట్టు కనిపించింది. తన ముఖంలో హావభావాలు ఒక్కసారిగా మార్చివేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘డాకు మహారాజ్’ హిట్ కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో బాలకృష్ణతో పాటు దర్శకుడు బాబీ, నిర్మాత సూర్యదేవర నాగవంశి పాల్గొన్నారు. సినిమాలో స్పెషల్ పాట చేసిన ఊర్వశి రౌతుల సైతం ఈ పార్టీలో పాల్గొని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఊర్వశి రౌతులతో బాలకృష్ణ చిందులు వేశారు.అంతేకాకుండా మరోసారి పాటలో లాగా కొట్టారు.