ఏపీ లో గత కొన్ని నెలల నుంచి విచ్చలవిడిగా హత్యలు, మహిళల పైన అత్యాచారాలు వంటివి జరుగుతూనే ఉన్నాయి.. ఈ మధ్య కాలంలో సంచలనంగా మారిన కొలకత్తా డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం దేశమంతట పాకిపోయింది.అందరూ ఈ విషయం మీద ధర్నాలు చేయడం కూడా జరిగింది. మారుతారు అనుకున్నప్పటికీ.. అయినప్పటికీ కూడా ఇలాంటివి ఎక్కడో ఒకచోట మనం వింటూనే ఉంటున్నాము.ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పరిధిలో ఉండే శ్రీకాకుళంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.9వ తరగతి చదువుతున్న బాలిక పైన గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన అక్కడ వున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది.13 ఏళ్ళ బాలిక పైన అత్యాచారం చేసిన నలుగురు యువకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బాలిక తల్లిదండ్రులు మరణించడంతో ఆమె ఎక్కువగా తన అమ్మమ్మ దగ్గరే ఉండేదట. ఇలాంటి సమయంలో అదును చూసుకొని మరి నలుగురు యువకులు ఈ బాలిక పైన అత్యాచారం చేశారట..
అయితే వీరు గతంలో కూడా ఈ బాలిక పైన అత్యాచారం చేయడంతో అక్కడి పెద్దలు ర్యాలీ చేసి వీరిని దూరంగా ఉంచాలని హెచ్చరించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు మరొకసారి బాలికకు మాయ మాటలు చెప్పి మళ్లీ ఆ బాలిక పైన అత్యాచారం చేయడంతో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.అయితే ఆ బాలిక ఫిర్యాదు మేరకు అత్యాచారం చేసిన యువకులైన సునీల్ ,మధు, చంద్ర తో సహా మరి కొంతమంది యువకుల పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పైన పోలీసులు సైతం చర్యలు చేపట్టిన తర్వాత ఏ విషయం అన్నది తెలియజేస్తామంటూ చెబుతున్నారట. ఇలాంటివి జరగకుండా ఏపీ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.