మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత పెరుగుతుంది . పైకి అంతా బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం ఇరు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే తెలుస్తుంది . ఇక అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం చక చక జరిగిపోయాయి. ఇటీవల మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కల్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేశారు. మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది.
చిరంజీవి , రామ్ చరణ్ , రాజమౌళి , సుకుమార్, నాని, రానా డైరెక్టర్ క్రిష్ ఇలా చాలామంది ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నిహారిక సినిమాపై ఎటువంటి కామెంట్ చేయలేదు.దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టం అవుతోంది. ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో మెగా , అల్లు వివాదం మరింత ముదిరినట్టు అయింది. మెగా డాటర్ నిహారిక నిర్మాత మారి కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మెగా హీరోలు మద్దతుగా నిలిచారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు.