బరువు తగ్గడానికి కొంతమంది తరచుగా బ్లాక్ కాఫీని తాగుతారు. రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ బ్లాక్ కాఫీకి మరికొన్ని మసాలాలు జోడించి తాగితే ఆ కాఫీ మరింత రుచికరంగా ఉండడమే కాదు.. మరింత మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ కాఫీలో కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులు కలిపితే.. దాని ప్రయోజనం మరింత పెరుగుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. ఈ నేపధ్యంలో బ్లాక్ కాఫీని ప్రతిరోజూ తాగడంతోపాటు వంటగదిలో ఉండే కొన్ని మసాలా దినుసులను కలిపినట్లైతే అది మరింత రుచికరంగా ఉండడమే కాకుండా .. బరువు తగ్గించే ప్రయత్ననాన్ని మరింత ఈజీ చేస్తుంది.
మసాలాలు బరువు తగ్గించడంలో సహాయపడే పోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కనుక ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. అది కూడా సహజ పద్ధతులను అవలంబిస్తూ బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ కాపీలో కొన్ని రకాల మసాలా దినుసులను కలపాలి.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని కొవ్వును కాల్చడంలో తోడ్పడతాయి..అందువల్ల బ్లాక్ కాఫీని తాగినప్పుడల్లా ఆ కాఫీ లో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగాలి.
అల్లం:
అల్లం బరువు తగ్గించడంలో కూడా చాలా మేలు చేస్తుంది. చలికాలంలో చాలా మంది అల్లం ఎక్కువగా తీసుకుంటారు. అల్లం అనేక శరీర సమస్యలను నయం చేయడంలో ముందు ఉంటుంది. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్లంలో ఉన్నాయి. బ్లాక్ కాఫీలో తాజాగా తురిమిన అల్లం కలిపి తాగాలి.
పసుపు:
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎవరైనా త్వరగా బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ కాఫీలో చిటికెడు పసుపు వేసి తాగాలి.
మిరియాలు:
నల్ల మిరియాలు బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. నల్ల మిరియాలలో పైపైన్ ఉంటుంది, ఇది కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గడానికి తాగే బ్లాక్ కాఫీలో కొద్దిగా నల్ల మిరియాల పొడిని జోడించి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
బ్లాక్ కాఫీలో ఈ మసాలా దినుసుల్లో ఏదోక దానిని మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. వీలైతే బరువు తగ్గడంలో తొందరగా ఫలితాలు దక్కాలంటే రోజుకు 1-2 సార్లు త్రాగండి. అయితే ఇలాంటి కాఫీలో చక్కెర, క్రీమ్ వంటి వాటిని ఉపయోగించకూడదు.