3 సినిమాల్లో నటించి … రూ. వేల కోట్లు కూడబెట్టిన హీరో !!!

Acting in 3 movies... Rs. A hero who accumulated thousands of crores!!!

 

స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మానందం తెలుగు సినీ చరిత్రలో తనకోసం ప్రత్యేకంగా ఓ పేజీని సంపాదించారు. చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన సినీ ప్రస్థానం తను లేకుండా సినిమా లేదు అనేంతస్థాయికి ఎదిగారు. కొన్ని సినిమాల్లో హీరో ఉన్నప్పటికీ నిజమైన హీరో మాత్రం బ్రహ్మానందం అంటారు. అంతలా అతని కామెడీ ప్రజలను అలరించింది. తన వారసుడిగా పెద్ద కొడుకు గౌతమ్ ను సినీరంగానికి పరిచయం చేశారుకానీ విజయవంతం కాలేకపోయారు. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో గౌతమ్ తెలుగు సినీ పరిశ్రమలోకి  ప్రవేసిపెట్టారు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. తర్వాత బసంతి, మను అనే సినిమాలు చేశారు.

 

పెట్టుబడిపై పెట్టుబడులు పెడుతున్నాడు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందే వ్యాపారాలు చేస్తున్నాడు గౌతమ్. సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టిసారించారు. బ్రహ్మానందం భారీగా ఆస్తులను కూడబెట్టాడు. గౌతమ్ వాటిని పెద్దవి చేస్తున్నాడు.వాటినుంచి వచ్చే ఆదాయం, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం కలిపి ఐటీ కంపెనీలో పెట్టుబడిగా పెట్టారు. ఆ కంపెనీ నుంచి ఊహించనిరీతిలో ఆదాయం వస్తోంది.హైదరాబాద్ నగరంలో భారీగా కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. వాటి నుంచి ఆదాయం వస్తోంది. అలాగే బెంగళూరులో పదుల సంఖ్యలో రెస్టారెంట్స్ ఉన్నాయి.

 

ఏడాదికి రూ.360 కోట్లకు పైగా ఆదాయం ప్రస్తుతం గౌతమ్ నెలకు రూ.30 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంటే సంవత్సరానికి రూ.360 కోట్లు సంపాదిస్తున్నాడు. దీన్ని మరో కంపెనీలో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని మరింత సంపాదిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రేక్షకులంతా నోరు వెళ్లబెడుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు కూడా అంత సంపాదించలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వ్యాపారంలో భారీగా విజయవంతమైన గౌతమ్ త్వరలోనే మరో సినిమాలో నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందులో తన తండ్రి బ్రహ్మానందం కూడా ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తెలుగు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా హీరోలై పారితోషికాన్ని భారీగా పెంచినప్పటికీ గౌతమ్ స్థాయిలో ఆదాయాన్ని మాత్రం ఆర్జించలేకపోతుండటం విశేషం.

Leave a Reply