తాజాగా వాగులో ఓ మత్స్యకారుడు చేపలకోసం వల వేశాడు. కాసేపటికే వల బరువెక్కడంతో అతను తెగ సంతోషించాడు. తన పంట పండిందనుకున్నాడు. భారీగానే చేపలు పడి ఉంటాయనుకున్నాడు. ఎంతో ఆరాటంగా వలను పైకి లాగిన అతను వలలో చిక్కింది చూసి హడలి పోయాడు. దెబ్బకు అక్కడ్నుంచి పరుగులు తీసాడు.
చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అరుదైన, ఖరీదైన చేపలు చిక్కితే జాలర్ల సంతోషానికి అడ్డూ అదుపూ ఉండదు. మరికొన్నిసార్లు చేపలు పడకపోగా.. వలల్లో వింత జీవులూ చిక్కుతూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా వాగులో ఓ మత్స్యకారుడు చేపలకోసం వల వేశాడు. కాసేపటికే వల బరువెక్కడంతో అతను తెగ ఆనందపడిపోయాడు. తన పంట పండిందనుకున్నాడు. భారీగానే చేపలు పడి ఉంటాయనుకున్నాడు. ఎంతో ఆరాటంగా వలను పైకి లాగిన అతను వలలో చిక్కింది చూసి హడలి పోయాడు. దెబ్బకు అక్కడ్నుంచి పరుగందుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రామవాగులో ఎప్పటిలాగే చేపల వేటకు వెళ్లాడు మత్స్యకారుడు. అయితే ఆ వలలో చేపలకు బదులు 9 అడుగుల భారీ కొండచిలువ చిక్కింది. ఎంతో సంతోషంగా వలను పైకి లాగిన మత్స్యకారుడు కొండచిలువను చూసి భయపడ్డాడు. స్థానికులకు విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చి అక్కడకు చేరుకున్నారు. అటవీ సిబ్బంది వలలో చిక్కుకున్న కొండచిలువను వలనుంచి తప్పించి సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.