జ్యోతిష శాస్త్రంలో తొమ్మిది గ్రహాలకు ద్వాదశ రాశులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే దేవతలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందూ పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవతలకు, ఇష్టమైన కొన్ని రాశుల వారికి ఆయా దేవతలు శుభ ఫలితాలను ఇస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన రాశుల వారు మాత్రమే కాకుండా శ్రీమహా విష్ణుమూర్తికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి. జీవితంలో వీరికి ఏదో ఒక సమయంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం విష్ణు కృపతో కలుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.విష్ణుమూర్తి కృపతో జాక్పాట్ కొట్టే రాశులు విష్ణుమూర్తి యొక్క కటాక్షం కారణంగా కొన్ని రాశుల వారికి జీవితాంతం అదృష్టం వరిస్తుంది. విష్ణుమూర్తి కృపతో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వీరు జాక్పాట్ కొడతారు.
సింహరాశి : విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే బిచ్చగాళ్లు కూడా సంపన్నులవుతారు .ఇక అటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం సింహ రాశి వారి పైన పుష్కలంగా ఉంటుంది. సింహ రాశి వారు విష్ణువు యొక్క కటాక్షం కారణంగా జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ఏ పనులలోను వెనుకంజ వేయకుండా సింహరాశి వారు ముందుకు సాగుతారు. సింహరాశి జాతకులు రాజకీయ నాయకులయితే, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. ఉన్నత పదవులలో గుర్తింపు పొందుతారు.
తులారాశి :తులా రాశి వారిపై విష్ణువు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వీరికి ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తూ విష్ణువు ఆయన కృపను వారిపై కురిపిస్తూ ఉంటాడు. తులా రాశి జాతకులకు అడుగడుగున విష్ణువు సహాయం చేస్తాడు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి విజయాలను సాధించేలా దీవిస్తాడు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండేలా చూస్తాడు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారి జీవితం విష్ణువు కటాక్షం కారణంగా విజయ తీరాలను చేరుతుంది. ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు. కర్కాటక రాశి వారికి విష్ణువు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. విష్ణుమూర్తి దయతో కర్కాటక రాశి వారు ఏ పని చేయాలనుకున్నా వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతారు.