అయోధ్య రామ మందిరం లో దొంగలు.. మందిర పరిసరాల్లో చోరీ వాటి విలువెంతో తెలిస్తే..!

"Image of Ayodhya's Ram Mandir, where a recent theft occurred, resulting in the loss of valuable items such as cash and jewelry. The temple is a significant religious site for Hindus."

అయోధ్య రామాల‌య నిర్మాణం అనంత‌రం మందిర ప‌రిస‌ర ప్రాంతాల‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చాలా సుంద‌రంగా ముస్తాబు చేసింది. భ‌క్తిప‌థం, రామ‌ప‌థం మార్గాల్లో వెదురు స్తంభాల‌తో కూడిన లైట్ల‌ను ఏర్పాటు చేసింది. వాటిలో 3,800 వెదురు స్తంభాల లైట్ల‌ను, 36 గోబో ప్రొజెక్ట‌ర్ లైట్ల‌ను దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.50ల‌క్షల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచనా వేశారు. ఆల‌య ట్ర‌స్టు పోలీసుల‌కు ఈ నెల 9న ఫిర్యాదు చేయ‌గా, తాజాగా ఇది వెలుగులోకి వ‌చ్చింది. ఈ మేర‌కు అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ శేఖర్ శర్మ ఫిర్యాదు చేశారు.రామ్‌పథ్‌లోని చెట్లపై ఏర్పాటు చేసిన 3,800 వెదురు లైట్లు, భక్తి పథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు అపహరణకు గురైనట్లు ఆల‌య ట్ర‌స్టు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు.

కాగా, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి.ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం రామ్‌పథ్‌లో 6,400 వెదురు లైట్లు, భక్తి ప‌థంలో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను సంస్థలు ఏర్పాటు చేశాయి. మార్చి 19 వరకు అన్ని లైట్లు బాగానే ఉన్నాయి. కానీ మే 9 న తనిఖీ తర్వాత కొన్ని లైట్లు కనిపించలేదు. ఇప్పటి వరకు 3,800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు అని శేఖర్ శర్మ తెలిపారు.అయోధ్యను స్మార్ట్ సిటీగా డెవలప్ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన పథకం కింద మఠం-ఆలయంతోపాటు, ప్రధాన రహదారుల వెంట ఆకర్షణీయమైన దీపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతాలలోని ఈ అందాలను చూసి దొంగలు ఎప్పుడు, ఎలా వెళ్లారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply