మనం వాడే పాలు స్వచ్ఛమైనవేనా అని తెలుసుకోవడం ఎలా……

How to know if the milk we use is pure.

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో కాల్షియంతోపాటు ఎన్నో రకాల పోషకాలు అధికం గా ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం అధిక లాభాలకు కక్కుర్తిపడి పాలను కలుషితం చేస్తున్నారు. వాటిల్లో రకరకాల రసాయనాలను కలిపి ప్యాకెట్స్ రూపంలో అమాయక ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మీరు వినియోగించే పాలు అసలైనవో కాదో.. తెలుసుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మనం తెలుసోకోవచ్చు…

Milk | Definition, Types, Processing, & Nutritional Value | Britannica

Step1:

 

స్వచ్ఛమైన పాల రంగు తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన పాలను వేడిచేసినప్పుడు, లేదంటే చల్లని ప్రదేశంలో ఉంచినప్పుడు రంగు మారదు. పాలు పసుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి.

STEP2:

పాల స్వచ్ఛతను పరీక్షించడానికి.. ఐదు నుంచి పది మిల్లీలీటర్ల పాలను తీసుకుని సమానంగా నీళ్లలో కలపాలి. ఈ సమయంలో పాలలో నురగ కనిపిస్తే.. పాలలో వాషింగ్ పౌడర్, డిటర్జెంట్ పౌడర్ కలిపినట్టువున్నారు అని మనం గమనించాలి.

Lowfat 1% Milk | Organic Valley

Step3:

స్వచ్ఛమైన పాలు తియ్యగా ఉంటాయి. ఇంటికి తెచ్చిన పాలను వేడి చేసి తాగిన తర్వాత తీపిగా అనిపిస్తే కల్తీ లేదని అర్థం. కల్తీ పాలు చేదుగా ఉంటాయి. అలాగే పాలలో నీరు కలిసిందో లేదో పరీక్షించడానికి ఒక చుక్క పాలను నేలపై వేయాలి. అది స్వచ్ఛమైన పాలైతే, త్వరగా భూమిలోకి ఇంకిపోదు. పాలలో నీరు కలిపితే వెంటనే ఇంకిపోతుంది.

Step4:

పాలలో మైదా కలిపి కూడా పాల కల్తీని మనం తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఐదు మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. అయోడైజ్డ్ ఉప్పు రెండు టీస్పూన్లు పాలలో వేయాలి. పాలు నీలం రంగులోకి మారితే ఆ పాలు కల్తీ అని అర్థం చేసుకోవాలి.

Leave a Reply