ముద్ర లోన్ అప్లై : కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారికి ఎన్నో స్కీమ్స్ అందుబాటులోకి తెస్తున్న సంగతి మన అందరికి తెలుసు . వీటి ద్వారా ఎందరో లాభం పొందుతున్నారు కూడా. ఇప్పుడు మనం పీఎం ముద్ర యోజన గురించి తెలుసుకుందాం. దీని ద్వారా గరిష్టంగా రూ. 20 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి ష్యూరిటీ కూడా అవసరం లేదు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ దగ్గర నుంచి ఇతర పెన్షన్ పథకాలు, ఇంకా లోన్ ఆఫర్లు ఇలా చాలానే ఉన్నాయి.
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు, నిరుద్యోగులు, మహిళలు, తమ వ్యాపారాల్ని మరింత మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు వంటి వారు ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవచ్చు. 2015 ఏప్రిల్ 8న.. స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీం ప్రారంభించారు. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయేతర బెనిఫిట్స్ కోసం లోన్లు ఇస్తారు.
చివరగా తరుణ్ లోన్ కింద రూ. 5 నుంచి 10 లక్షల వరకు గతంలో ఉండగా.. ఇప్పుడు ఇది రూ. 20 లక్షల వరకు తీసుకునే ఛాన్స్ ఉంది.ఇక ఈ పథకం కింద 3 రకాల లోన్లు అందిస్తారు. మొదటిది శిశు లోన్. దీని కింద రూ. 50 వేల వరకు లోన్ వస్తుంది. తర్వాతది కిషోర్ లోన్. ఇక్కడ రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అందుకోవచ్చు.
ముద్ర స్కీం కింద లోన్ పొందేందుకు.. దరఖాస్తు దారుడు వ్యాపార ప్రణాళిక సిద్ధం చేసి.. అవసరమైన డాక్యుమెంట్స్ బ్యాంకుకు ఇవ్వాలి. లోన్ కోసం అప్లై చేసేవారు భారతీయుడై ఉండాలి. బ్యాంక్ అడిగిన ఇతర డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్ అవ్వకూడదు. మంచి సిబిల్ స్కోరు కూడా ఉండాలి. దరఖాస్తుదారుడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలి.