హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అటకటిస్తుంది. సామాన్యుడైనా, వీఐపీ అయినా… అందరికి ఒకే రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటూ యమా దూకుడు మీదుంది. నిన్న సినీనటుడు నాగార్జునకి సంబంధించిన ఎన్-కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన హైడ్రా.. ఇవాళ కూడా అదే దూకుడు సాగిస్తోంది.
హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అటకటిస్తుంది. సామాన్యుడైనా, వీఐపీ అయినా… అందరికి ఒకే రూల్.. రూల్ ఫర్ ఆల్ అంటూ యమా దూకుడు మీదుంది. నిన్న సినీనటుడు నాగార్జునకి సంబంధించిన ఎన్-కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన హైడ్రా.. ఇవాళ కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించడం… ఆ వెంటనే కూల్చివేయడం ఫాస్ట్ జరిగిపోతున్నాయి. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు 18 చోట్ల కూల్చివేతలు జరిగాయని.. చెరువులు, నాలాలకు ఆనుకుని 43 ఎకరాల స్ట్రక్చర్‌ను తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. తుమ్మిడికుంటలో 4.9 ఎకరాల్లో ఉన్న ఎన్-కన్వెన్షన్‌ను కూల్చడంతోపాటు.. గండిపేట చెరువులో మొత్తం 15 ఎకరాల ఆక్రమణలు తొలగించినట్లు స్టేటస్ రిపోర్ట్ లో హైడ్రా అధికారులు వివరించారు..
ఇప్పటివరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ఆదివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, ప్రో కబడ్డీ యజమాని అనపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది.
కావేరి సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్‌రెడ్డి, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, నందగిరిహిల్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు, చింతల్‌లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు తెలిపింది.అయితే ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు.. ఇక ముందు హైడ్రా ఎవరి ఆక్రమణలపై గురిపెడుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.