మానవత్వం మరోసారి చాటుకున్నా …. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు

Humanity is once again shown.... Bharatiya Janata Party state president

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి మానవత్వం చాటుకున్నారు. రాజమహేంద్రవరం రోడ్డు మార్గంలో వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి తన వాహనాన్ని ఆగిపోయాడు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వెంటనే పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు ఎంపీ పురంధేశ్వరి. అనంతరం అత్యవసర చికిత్స విభాగానికి చేర్పించి.. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని మానవత్వంతో తన వాహనంలో హాస్పిటల్‌కు తరలించిన ఎంపీని పలువురు అభినందించారు.

రాజానగరం జిఎస్ఎల్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా వెళ్తున్న పురంధేశ్వరి రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా మాట్లాడారు. అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలిని స్థానిక జిఎస్ఎల్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం కాల్ చేసి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆమె వెంట ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply