ఏపీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. సైన్స్ ల్యాబ్‌లో కెమికల్స్ లీకవడంతో ఆ వాయువులను పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటన పై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే విద్యార్ధులను బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.