తిరుమల శ్రీవారిని ‘సరిపోదా శనివారం’ టీమ్ దర్శించుకున్నారు. న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం.ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ‘అంటే సుందరానికీ’ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ పర్వాలేదు అనిపించుకుంది. అయినప్పటికీ నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేసాడు. ఈ మూవీని RRR ఫేమ్ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ ఎస్‌జే సూర్య ఇందులో విలన్ పాత్ర లో నటించడం విశేషం. ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమాను అన్ని భాషల్లో నాని ప్రమోట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సరిపోదా శనివారం టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాని, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. ఈ తెల్లవారు జామున సినిమా యూనిట్ తో కలిసి అలిపిరి మెట్ల మార్గలో కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. నడకమార్గంలో నానితో పలువురు భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా నానితో పాటు తిరుమల చేరుకున్నారు. VIP బ్రేక్ దర్శనంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నాని కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.