గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది.అర్హత ఉన్న వారు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. బదిలీలను నిర్వహించే విభాగాలు 28వ తేదీన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుంటాయి.
29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేస్తామని తెలిపింది.
కౌన్సెలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరుకావాల్సి ఉంటుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ నుంచి కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇవ్వవచ్చు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పని చేసిన వారు బదిలీకి అర్హులని ప్రభుత్వం చెప్పింది.అయితే ఈ బదిలీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అంతర జిల్లా బదిలీలకు అవకాశం కల్పించలేదని విమర్శలు తలెత్తుతున్నాయి.