అక్కినేని కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇస్తున్న శోభిత ధూళిపాళ్ళ ఇప్పుడు అక్కినేని వారి కుటుంబానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తోంది. నాగ చైతన్యకు ఎలా ఇష్టమో అలా తాను బ్రతికే ప్లాన్ చేస్తోంది.ఎక్కడ గ్యాప్ రావొద్దని అత్తవారింటిని ఎక్కడా బాధ పెట్టకుండా ఆమె అడుగులు వేస్తోంది. నాగ చైతన్య ఇష్టాలను గౌరవిస్తోంది. అవసరమైతే సినిమాలకు దూరమయ్యే ఆలోచనలో కూడా ఉంది ఈ తెలుగు అమ్మాయి. శోభిత సినిమాల్లో కంటిన్యూ అయినా తనకు ఏ ఇబ్బంది లేదని నాగ చైతన్య చెప్పాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
శోభితకు ఆఫర్లు కూడా ఇప్పుడు బాగానే వస్తున్నాయి. తాజాగా డాన్ 3 సినిమాలో ఆమెకు ఒక ఆఫర్ వచ్చిందని సినీ వర్గాలలో వినిపిస్తుంది.రణవీర్ సింగ్ పక్కన ఒక ఐటెం సాంగ్ చేయడానికి ఆమెకు ఆఫర్ వస్తే ఆమె ఆన్సర్ విని దర్శకుడు షాక్ అయ్యాడట. ఐటెం సాంగ్స్ చేయను అని సినిమాలో ఏదైనా వేరే రోల్ ఉంటే చెప్పాలని ఆమె అడిగిందట. దీనితో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఆమె కోసం ఒక మంచి రోల్ డిజైన్ చేస్తున్నారట. మన టాలీవుడ్ కన్నాబాలీవుడ్ కు ఆమె ఎప్పుడు దగ్గరగా ఉంటారు.దీనితో అక్కడ ఆఫర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి.కాని ఇప్పుడు ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే మాత్రం ఆమె నో చెప్పడం వెనుక కారణం ఏమై ఉండవచ్చు అనేది ఎవరికి అర్ధం కాకపోయినా… చైతూకి ఇష్టం లేదని, అందుకే తాను చేయడం లేదని, పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్తున్నప్పుడు కెరీర్ కంటే లైఫ్ ముఖ్యం అని భావించి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.పెళ్లి చేసుకునే గ్యాప్ లో రెండు సినిమాలను పూర్తి చేయాలని ఆమె భావిస్తున్నారు. అదే సమయంలో ఆమె చేసే సినిమాలను కొంచెం ఆచితూచి సెలెక్ట్ చేస్తునట్టున్నారు.గతంలో సమంతాపై కొన్ని ఆరోపణలు రావడంతో వాటిని దృష్టిలో పెట్టుకునే శోభిత జాగ్రత్తలు తీసుకుందని అంటున్నారు.