హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో స్థలాలు ఇళ్లు కట్టొద్దు కొనొద్దు అంటున్న : కమిషనర్

Do not build houses in these parts of Hyderabad and say: Commissioner

హైదరాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. జీవనోపాధి, ఉద్యోగం అంటూ వందలాది మంది పక్క రాష్ట్రాల నుండి ఇక్కడ ఉపాధికి వస్తున్నారు . దీంతో జన జీవనం పెరిగింది. నిర్మాణాలు, కట్టడాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ కట్టడాలు మొదలయ్యాయి. చెరువుల, కుంటలను కబ్జా చేయడంతో పాటు.. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీని వల్ల కట్టిన కొద్ది టైంకే కూలిపోతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఈ మేరకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్.. కొన్ని నిషేధిత ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించింది.

Do not build houses in these parts of Hyderabad and say: Commissioner
భాగ్య నగరంలో బఫర్ జోన్స్‌లో స్థలాలు కొనొద్దని, నిర్మాణాలు చేపట్టొద్దని రంగనాథ్ తెలిపారు . అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని, రెండో దశలో భవనాలు నిర్మించిన వారిపై చర్యలు, కన్ స్ట్రక్షన్స్ కు నిరాకరణ ఉంటుందని తెలిపారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అది కూడా ఆక్రమణ రూపంలో కనుమరుగవ్వడం విచారకరమని అన్నారు. 60 నుండి 80 శాతం వరకు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. అలాగే GHMC పరిధిలో చెరువులు, కుంటలు ఉన్నాయని తెలిపారు. ఎన్ఆర్ఎస్సీ నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు.
ఇక భవిష్యత్తులో వీటిని స్టాప్ చెయ్యకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు రంగనాథ్. గొలుసు కట్టు చెరువులన్నీ పునరుద్దరిస్తామని చెప్పారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకు పోయాయన్నారు. చెరువుల పరీక్షణకు అందరితో కలిసి మేథో మథనం చేస్తామని పేర్కొన్నారు. చందా నగర్‌లో గతేడాది బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ ఎవరూ స్థలాలు కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఇలా అక్రమాలు పాల్పడకుండా ఉండేందుకు హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుందని వెల్లడించారు.

 

 

 

 

Leave a Reply