అన్నమయ్య జిల్లా పీలేరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. గత నెల 23న పీలేరు ప్రాంతంలో పలు దోపిడీలకు పాల్పడిన ఆరుగురు దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి బంగారం, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి రోడ్ లోని బోదసాపల్లి, కడప రోడ్‌లోని గిరినాయుడు కుటుంబాన్ని కత్తులు, పిస్తోల్ లతో బెదిరించి దొంగతనాలకు పాల్పడిన ముఠాగా తెలిపారు. కట్ చేస్తే ఈ దొంగల..
నంద్యాల, ఆగస్టు 23: అన్నమయ్య జిల్లా పీలేరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. గత నెల 23న పీలేరు ప్రాంతంలో పలు దోపిడీలకు పాల్పడిన ఆరుగురు దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి బంగారం, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగిన దోపిడీ సొమ్ము పంచుకోవడంలో వచ్చిన తేడాతో జరిగిన హత్య కేసులో అరెస్ట్ అయిన దొంగను విచారించడంతో 9 మంది ముఠా సభ్యుల బండారం బయటపడింది. మదనపల్లి రోడ్ లోని బోదసాపల్లి, కడప రోడ్‌లోని గిరినాయుడు కుటుంబాన్ని కత్తులు, పిస్తోల్ లతో బెదిరించి దొంగతనాలకు పాల్పడిన ముఠాగా గుర్తించారు. కట్ చేస్తే ఈ దొంగల ముఠాది పెద్ద నేరచరిత్రగా తెలిసింది.
దొంగల ముఠాలో కీలకమైన ముగ్గురు దొంగల్లో శ్యామ్, సచిన్, సాగర్‌ల మద్య విభేదాలతో ఈ నెల 9 న నంద్యాల జిల్లా పాణ్యంలో ఒకరిని హత్య చేశారు. సాగర్ అనే దొంగను కాల్చి చంపిన మరో దొంగ శ్యామ్ అరెస్టుతో ఈ వ్యవహారం బయటపడింది.శ్యామ్, సచిన్ లపై కర్ణాటకలో 40 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పరారీలో ఉన్న సచిన్ కోసం గాలింపు చేపట్టారు. అరెస్టు చేసిన దొంగలంతా అనంతపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ముఠాలోని షేక్ రహమాన్, సయ్యద్ సలీం, షేక్ మస్తాన్, సయ్యద్ రఫీ, సయ్యద్ హుస్సేన్, బాషాలను అరెస్ట్ చేసి.. వారి నుంచి బంగారు, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శ్యామ్‌ను అరెస్ట్ చేసి సాగర్ హత్య కేసును పాణ్యం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో శ్యామ్ ను విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్యామ్ అరెస్టు కాగా సచిన్ సచిన్ అనే మరో దొంగ పరారీలో ఉన్నాడు. ఇక పాణ్యం పోలీసులు ముఠా పాల్పడ్డ నేరాల వివరాలను సేకరించి అన్నమయ్య జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేసిన పీలేరు పోలీసులు 9 మంది ముఠా సభ్యుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు.