రియాల్టీ షో అయిన బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఫేమస్ అయ్యారు. మరికొందరు ఉన్న ఫేమ్ ను కూడా పోగొట్టుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఓ వీడియో ఆమెను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.ఆ తర్వాత ఆవిడ బిగ్ బాస్ లో అడుగుపెట్టి, ఆమె పాపులారిటీని మరింత పెంచుకుంది. ఈమె ఎప్పడికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోషూట్లతో, అలాగే తన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇక ఈ మధ్యనే తాను ప్రేమలో ఉన్నానన్న విషయాన్ని బయటకు చెప్పింది.తాజాగా ఏకంగా తన ప్రియుడుని పరిచయం చేసింది. అతడి పేరు గౌతమ్ కోపిశెట్టి. అతడు యోగ ట్రైనర్. తాజాగా వీరిద్దరూ నటించిన వీడియో ప్రస్తుతం పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇనయా సుల్తానా తన ప్రియుడితో బెడ్ రూమ్ లో ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేసింది. ఇకపోతే వారిద్దరూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా.. వారిద్దరూ రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.