కోల్కతా రేప్‌ కేసులో ట్విస్ట్..సంచలన విషయాలు బయట పెట్టిన సీబీఐ …

"CBI reveals new, suspicious details in a dramatic twist to the Kolkata rape case, raising questions and altering the investigation's direction."

కోల్కతా రేప్‌ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ సంచలన విషయాలు బయట పెట్టింది. ఈ మేరకు “సీల్డ్ కవర్” లో సంచలనాత్మక వివరాలు….సుప్రీం కోర్టు ముందు ఉంచింది సీబీఐ.ఈ క్రమంలోనే కోల్కతా పీజీ డాక్టర్ హత్యాచార కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. హత్యాచారాన్ని కప్పి పుచ్చే ప్రయత్నాలు జరిగాయని సుప్రీం కోర్టు కు ఇచ్చిన నివేదిక లో తేల్చి చెప్పింది సీబీఐ.

Kolkata doctor rape case highlights: SC to hear plea related to RG Kar  hospital case today at 10.30 | Today News

అంతిమ సంస్కారం తర్వాత ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారని వెల్లడించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని తారుమారు చేశారని కూడా సీబీఐ ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సరిగ్గా ఇవ్వలేదని చెప్పింది సిబిఐ. దీంతో సిబిఐ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సిబిఐ తరపున తుషార్ మెహతా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply