హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆ లిస్ట్ లోకి మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ. బోర్డ్ తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ.! అయ్యప్పసొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకున్నారు . ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది.
హైదరాబాద్ మాదాపూర్‌లోని మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్పసొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో బ్రాంచీలు ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.