టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన ఇలియానా….

"Ileana making provocative comments about a Tollywood director."

ఇప్పుడైతే రోజుకో హీరోయిన్ టాప్ ప్లేస్‌లో ఉంటున్నారు కానీ, ఒకనొక సమయంలో ఇలియానా దశాబ్ద కాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉండి రికార్డ్ క్రియేట్ చేసింది.రామ్ హీరోగా నటించిన ”దేవదాసు” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, తక్కువ కాలంలోనే స్టార్ హీరయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రెండో సినిమానే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. ”పోకిరి” సినిమాతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె నడుమే గుర్తుకు వస్తుంది. ఎవరినైనా పొగిడే సమయంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంది అని అంటూ ఉంటారు.అంత ఫేమస్ అయింది ఇలియానా నడుము. కోటి రూపాయిలు పారితోషకం అందుకున్న తొలి హీరోయిన్‌గా ఇలియానా చరిత్ర సృష్టించింది. అంతలా ఆమె క్రేజ్ ఉండేది. అయితే ఇలియానా నటించిన సినిమాలు ఫెయిల్ కావడం, ఇదే సమయంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఇలియానాకు ఆఫర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి.దీంతో బాలీవుడ్ బాటపట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

Ileana D'Cruz confesses of being an atheist – India TV

ఇదిలా ఉంటే ఇలియానాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఇలియానా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన జీవితంలో తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది నన్ను లైంగికంగా చాలా వేధించారు.అందులో కొంత మంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారు. ఇక ఓ డైరెక్టర్ కోరిక తీర్చలేక నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాను అని చెప్పింది.ఆ టైంలో తనకు ఫ్యామిలీ గుర్తుకు వచ్చి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని ఇలియానా చెప్పింది.ఎవరో మూర్ఖుడు గురించి నేను ఎందుకు చనిపోవాలని అనుకున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలియానా తనను వేధించిన ఆ డైరెక్టర్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇలియానా మాటలు విన్నా ఆమె అభిమానులు ఇంతకీ ఇలియానాని లైంగికంగా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరబ్బా అని కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply