ఒక్క మాట తో బాలీవుడ్ పరువు తీసిన సిద్దూజొన్నలగడ్డ….

"Siddu Jonnalagadda gaining Bollywood's respect with a powerful single word."

బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు టాలీవుడ్ విషయంలో కాస్త ఈర్ష్య తో ఉందనే విషయం కొన్నాళ్ళుగా అర్ధమవుతోంది.బాలీవుడ్ హీరోలను మించి ఇక్కడి హీరోలు సినిమాలు చేయడం, వసూళ్లు అక్కడి హీరోల ఊహకు కూడా అందని విధంగా ఉండటం వాళ్లకు నచ్చడం లేదనే చెప్పాలి.మన సౌత్ నుండి వచ్చే కథలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా ఏ సినిమా వచ్చినా వసూళ్లు మాత్రం భారీగా ఉంటున్నాయి. ఇటీవల వచ్చిన కల్కీ సినిమా అయితే ఏకంగా 1200 కోట్లు వసూలు చేసి రికార్డులు మోత మోగించింది.అయితే కల్కి సినిమా పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ప్రతీ సినిమా అందరికి నచ్చాలని లేదులే అని,ప్రభాస్ లుక్స్ జోకర్ గా ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ యువ హీరో సిద్దూ జొన్నలగడ్డ ప్రభాస్ కు అండగా నిలబడ్డాడు. ప్రభాస్ అన్న జోకర్ కాదు అంటూ బాలీవుడ్ నటుడుకి కౌంటర్ ఇచ్చాడు. బాలీవుడ్ లో హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్ కంటే ప్రభాస్ అన్న ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ ఎక్కువ అంటూ సెటైర్ వేసాడు.

Tillu Square' is more energetic and entertaining: Siddu Jonnalagadda

కల్కీ సినిమా సక్సెస్ వెనుక చాలా పెద్ద కష్టం ఉందని, సినిమా సక్సెస్ కి ప్రభాస్ అన్న పిల్లర్ లా నిలబడ్డాడు అంటూ కామెంట్ చేసాడు.భావ ప్రకటన స్వేచ్చ అందరికి ఉంటుందని, కాని దాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాం అనేది ఆలోచించుకుని మాట్లాడితే మంచిది అన్నాడు. సినిమా రంగంలోకి రావడం ఇక్కడ నిలబడటం అంత ఈజీ కాదు అని విమర్శలు చేయడం మంచిదే కాని జోకర్ లాంటి పదాలు వాడటం మంచిది కాదని అన్నాడు. అభిప్రాయాలను చెప్పే హక్కు అందరికి ఉంటుందని, అన్ని సినిమాలు అందరికి నచ్చాలనే రూల్ ఏం లేదన్నాడు సిద్దూ. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని స్టార్ ఇమేజ్ ప్రభాస్ అన్న సొంతం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

Leave a Reply