ఆ పని చేయడం ఇష్టం లేదు అంటున్న శ్రీలీల….

"Srileela stating she doesn't want to take on a specific project."

హీరోయిన్ గా ఎంత ఫాస్ట్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా సినిమా అవకాశాలు కూడా లేకుండా చేసుకుంది శ్రీ లీల. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.చాలా బిజీయెస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె నిలిచింది.కానీ ఏడాది తర్వాత ఈరోజు చూస్తే పరిస్థితి తారు మారయింది. ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా అందులో పవన్ సినిమా పక్కన పెడితే ఇంకోటి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఏంలేదు.ఆమె స్టార్ హీరోలతో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో ఆమెను మళ్లీ మళ్లీ తీసుకునేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్, గ్రేస్ ని ఆధారంగా చేసుకుని ఆమెకు రెండు ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఒక పెద్ద బాలీవుడ్ సినిమాతో పాటు తమిళ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో సైతం ఐటమ్ సాంగ్ చేయాల్సిందిగా ఆమెను నిర్మాతలు అడిగారట.అయితే తన కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని తాను ఐటెం భామగా మారే ఉద్దేశమే లేదని ఆమె తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజానికి తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఒక పక్క హీరోయిన్లుగా సినిమాలు చేస్తూనే ఐటెం సాంగ్ వచ్చినప్పుడు ఏమాత్రం కాదనకుండా వాటిని చేస్తూ వెళ్లారు.

Two Sides To Sreeleela's Failure Story

కానీ శ్రీ లీల మాత్రం అలా చేసేందుకు ఏమాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. తనకు అలా మారే ఉద్దేశం లేదని హీరోయిన్గా మాత్రమే చేస్తారని ఖరాఖండిగా చెప్పినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. నితిన్ పక్కన రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్ పక్కన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు హిట్ అవుతాయని నమ్ముతోంది. తర్వాత కచ్చితంగా హీరోయిన్ గానే కొనసాగుతానని ఆమె చెబుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.కానీ శ్రీ లీల మాత్రం అలా చేసేందుకు ఏమాత్రం ఇష్టపడలేదని తెలుస్తోంది. తనకు అలా మారే ఉద్దేశం లేదని హీరోయిన్గా మాత్రమే చేస్తారని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. నితిన్ పక్కన రాబిన్ హుడ్, పవన్ కళ్యాణ్ పక్కన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు హిట్ అవుతాయని నమ్ముతోంది. తర్వాత కచ్చితంగా హీరోయిన్ గానే కంటిన్యూ అవుతానని ఆమె చెబుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Leave a Reply