కొన్నాళ్ల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను విడుదల చేశారు.పనయూర్లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథమ్ ను సైతం రిలీజ్ చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ చెప్పారు.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. త్వరలో తిరుచ్చి వేదికగా భారీ బహిరంగంగా సభను నిర్వహించనున్నారు విజయ్. తమిళగ వెట్రి కళగం యొక్క జెండా ఎరుపు- పసుపు రంగులతో రెండు యుద్ధ ఏనుగులు మధ్యలో సూర్య కిరణాలతో తయారుఅయింది.
ఈ కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం నేతలు, వాలంటీర్లు, విజయ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయ్ తల్లిదండ్రులు ఎస్‌ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ ఇద్దరూ హాజరయ్యారు. నటుడు విజయ్ గత ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం అనే పార్టీని ప్రారంభించారు. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీని రిజిస్టర్ కూడా చేయించారు.ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలో 2026 శాసనసభ ఎన్నికలే తన టార్గెట్ అని కూడా విజయ్ ప్రకటించారు. దీంతో 2 కోట్ల మందిని పార్టీలో చేర్చుకునే పని వేగంగా సాగుతోంది. మెంబర్‌షిప్ రిక్రూట్‌మెంట్‌లో అన్ని స్థాయిల్లోని ఎగ్జిక్యూటివ్‌లు చురుకుగా పాల్గొంటున్నారు. ఇక ఈరోజు కోసమే 19వ తేదీన పనైయూరులోని పార్టీ కార్యాలయంలో మధ్యలో విజయ్ చిత్రం ఉన్న పార్టీ జెండాను ఎగురవేసి విజయ్ రిహార్సల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.