వరల్డ్ కప్ ఫైనల్‌లో తను పాల్గొనడం లేదు అని చెప్పిన మను భాకర్..

"Manu Bhakar, with a serious expression, announcing his decision not to participate in the World Cup final, surrounded by media or in a press conference setting."

పారిస్ ఒలింపిక్స్ 2024 లో షూటింగ్‌ లో భారత్‌ కు రెండు పతకాలు సాధించిన మను భాకర్.. అక్టోబర్ 13 – 18 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) వరల్డ్ కప్ ఫైనల్స్‌ లో పాల్గొనడం లేదు.మంగళవారం వేలమ్మాళ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. గత వారం స్టార్టింగ్ లో, ఆమె కోచ్ జస్పాల్ రానా కూడా ఇందులో పాల్గొననని చెప్పారు.

Manu Bhaker: షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో పాల్గొనడం లేదు.. మను భాకర్..

ఈ సందర్బంగా మను భాకర్ మాట్లాడుతూ.., “ఎనిమిదిన్నర సంవత్సరాలు విరామం లేకుండా నేను కోచింగ్ తీసుకున్నాను.ఇప్పుడు నా భుజానికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను మూడు నెలలు విరామం తీసుకుంటాను. ఆ తర్వాత నేను మళ్లీ శిక్షణ ప్రారంభిస్తాను. నేను 4 లేదా 5 నెలల తర్వాత పోటీ చేయడం ప్రారంభిస్తాను. దేశంలో నిరంతర ప్రయత్నాలు, అలాగే మెరుగైన వనరుల కలయిక రాబోయే సంవత్సరాల్లో క్రీడలలో గొప్ప విజయాన్ని సాధించగలదు” అని ఆమె తెలిపింది.

Leave a Reply