ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఘోరం జరిగింది. సకినాకా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.దేశంలో రోజు రోజుకు నేరాలు,ఘోరాలు,అత్యాచారాలుపెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా వైద్యురాలు హత్యకు గురైంది. ఈ ఘటన మరువక ముందే యూపీలో ఎస్పీ నేత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యాబుద్ధులు నేర్చుకోవల్సిన వయసులో మైనర్లు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. దీంతో తప్పుడు దారిలో వెళ్లి భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. చిన్నారిపై అత్యాచారం చేసిన తొమ్మిదో తరగతి విద్యార్థి జువైనల్ జైలుకెళ్లాడు. దీంతో భవిష్యత్ అంధకారంగా మారింది.