ఏపి లో ఐపిఎస్ బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం……ఎవరెవరు ఎక్కడికో మీకు తెలుసా?

State Govt has transferred IPS in AP......do you know who or where?

ఏపి లో అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారుల బదిలీలను పూర్తి చేసింది. ముందుగా అన్నీ శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీలను పూర్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కింది స్థాయి ఉద్యోగులు, వెయిటింగ్ లో ఉన్నవారికి పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ చేపట్టింది. తాజాగా పదిమంది ఐపిఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీరిలో కొందరు ఇటీవలనే బదిలీ అయినవారు కూడా ఉండడం కొత్త మాట.

మొన్నటివరకు అనకాపల్లి ఎస్పీ గా పనిచేసిన కేవి మురళీ కృష్ణ ను ఇటీవల అనంతపురం బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా ఆయన్ను అక్కడ నుంచి బదిలీ చేసి వెయిటింగ్ లో పెట్టింది. ఒక్కసారి ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారో చూద్దామా!

– ఇంటెలిజెన్స్ ఎస్పీ గా పనిచేస్తున్న సత్య ఏసు బాబు ను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం

అనంతపురం ఎస్ పీ గా ఉన్న కే వీ మురళీకృష్ణ ను 16 వ బెటాలియన్ కు బదిలీ

– అనంతపురం ఎస్పీ గా జగదీష్

– వెయిటింగ్ లో ఉన్న సుమిత్ గరుడ్ ను గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ గా బదిలీ

– కె.ఎం. మహేశ్వర రాజు, విజయవాడ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ గా బదిలీ

– గ్రేహౌండ్స్‌ గ్రూప్ కమాండర్‌ గా సునీల్ షియోరాన్

– గుంతకల్ రైల్వే ఎస్పీ గా రాహుల్ మీనా

– ఇంటెల్ ఎస్పీ గా షెల్కే నచికేత్ విశ్వనాథ్

– చింతూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పంకజ్ కుమార్ మీన

– పార్వతీ పురం ఎస్ డీ పీ వో గా సురానా అంకిత మహావీర్ బదిలీ

Leave a Reply