దేశ రాజధాని ఢిల్లీ లో బాంబు బెదిరింపులు…

Bomb threats in national capital Delhi

ఢిల్లీలోని మూడు మాల్స్, ఒక ఆస్పత్రికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.అయితే, ప్రజలను ఖాళీ చేయించి, ఆప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపడితే కొన్నిగంటల్లోనే అక్కడ అమర్చిన బాంబు పేలుతుందని ఈమెయిల్ వచ్చిందన్నారు. అయితే, ఆ బెదిరింపులు బూటకమని తేల్చారు. చాణక్య మాల్ (చాణక్యపురి), సెలెక్ట్ సిటీవాక్ (సాకేత్), ఆంబియెన్స్ మాల్ (వసంత్ కుంజ్), ప్రైమస్ హాస్పిటల్ (చాణక్యపురి)తో పాటు మరికొన్ని చోట్లకు బాంబు బెదిరింపులకు సంబంధించి తమకు సమాచారం అందిందని సీనియర్ అధికారులు తెలిపారు.

Delhi, the national capital, is special - The Sunday Guardian Live

బాంబు బెదిరింపు వచ్చిన చోట్ల ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక బృందాలు సోదాలు నిర్వహించాయన్నారు. సోదాల్లో ఎలాంటి బాంబు ఎక్కడా లభించలేదని వెల్లడించారు. దీనిపై, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఎక్కడ్నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేపడుతున్నారు.

Leave a Reply